హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విమానాశ్రయంలో ఏకే 47 బుల్లెట్ కలకలం

E.G: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఏకే 47 బుల్లెట్ బయటపడటం కలకలం రేపింది. పాలకొల్లుకు చెందిన ఓ మహిళా నర్స్ శిక్షణ నిమిత్తం ఢిల్లీ వెళ్తుండగా, సెక్యూరిటీ చెకింగ్‌లో ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఈ బుల్లెట్‌ను అధికారులు గుర్తించారు. వెంటనే బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న కోరుకొండ పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.