ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పలు గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమాలను సరైన సమయంలో పూర్తి చేయాలని, ఎలాంటి డీజేలు, లేజర్ లైట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గణపతి మండపాలను సందర్శించిన ఎస్పీ


