MNCL: మందమర్రి ఏరియా KK-5గనిలో బుధవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలోని మూడో సీన్ మెయిన్ లైన్ లో బండ కూలినట్లు కార్మికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆర్కేపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలువురు యూనియన్ నాయకులు సందర్శించి కార్మికుల ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
మరో ప్రమాదం..ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు


