హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఫుట్ బాల్ క్రీడల్లో జగిత్యాల మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో ఉపాసన, మరియం,కీర్తన, అండర్-17 విభాగంలో హారిక, పవిత్ర, సేహిత, జుబియా, సానియా సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ సుచిత్ర అభినందించారు.