ASF: బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామ శివారులో వ్యవసాయ భూమికి ఏర్పాటు చేసిన సుమారు 50 ఫెన్సింగ్ పోల్స్ ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. మెరుగు భిక్షపతి గౌడ్, మహ్మద్ ఇషాక్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. గజ్జల సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరిచి 14రోజులు రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఫెన్సింగ్ పోల్స్ ధ్వంసం.. ఇద్దరి అరెస్ట్


