హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రాజోలి మండల సర్వసభ్య సమావేశం

GDWL: రాజోలి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ ఖాన్ తెలిపారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో మండల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.