హైదరాబాద్: 28°C
తెలంగాణ

లో-వోల్టేజీ సమస్యకు పరిష్కారం

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏడీఈ శంకరయ్య బుధవారం రాత్రి ప్రారంభించారు. లో-వోల్టేజీ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో ఏఈ జానకిరామ్, ఎల్‌ఐ కొమ్ము కృష్ణ పాల్గొన్నారు.