హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్స్ ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. 11 కేవీ శ్రీ వేంకటేశ్వర ఫీడర్ లైన్ మార్పిడి పనుల దృష్ట్యా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోర్టు, కేడీఆర్ పార్కు, ఎక్స్‌ప్లో రికా స్కూల్, కెమిస్ట్రీ భవన్, శివ థియేటర్, వేంకటేశ్వర ఆలయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.