హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటిపై ప్రివిలేజ్ నోటీస్

SDPT: శాసనసభలో తమపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలసి పిటిషన్లు అందజేశామన్నారు. సభ సాక్షిగా చేసిన అబద్ధపు ప్రచారాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు వెల్లడించారు.