హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా అరవింద్ రెడ్డి

SRD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సూచనలతో సంగారెడ్డి జిల్లా యువ మోర్చా ఇన్‌‌ఛార్జ్‌గా ఎస్. అరవింద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అరవింద్ రెడ్డికి పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా యువమోర్చా పటిష్టతకు నిరంతరం శ్రమిస్తామన్నారు.