హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల రూరల్ ఎస్సైగా చంద్రశేఖర్

బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.