హైదరాబాద్: 28°C
వార్తలు

సన్న వరి బోనస్.. నేడే చివరి తేదీ

PDPL: ధర్మారం మండలంలోని అన్ని రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10:00 గంటలకు సన్న వరి బోనస్ కోసం రైతు వివరాలు నమోదు చేయనున్నారు. డీలర్ల వద్ద కాకుండా సొంతంగా సన్న వరి సాగు చేసి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి MAO ప్రకాష్ తెలిపారు. ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్, దరఖాస్తు ఫారంతో హాజరుకావాలన్నారు.