హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తురాలి పర్సును గుర్తించిన క్రైమ్ పోలీసులు

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ మధ్య పోగొట్టుకున్న పర్సును తిరుమల క్రైమ్ పోలీసులు గుర్తించి సంబంధిత భక్తురాలికి అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎడ్ల అప్పమ్మ పర్సును పోగొట్టుకోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దానిని గుర్తించి సురక్షితంగా ఆమెకు అందజేశారు. పర్సు తిరిగి లభించడంతో అప్పమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.