హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓజోన్‌పై ప్రజెంటేషన్లు.. విద్యార్థులకు క్విజ్

RR: రాజేంద్రనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, NSS యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఓజోన్ పొర ప్రాముఖ్యత, కాలుష్య ప్రభావాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. అనంతరం క్విజ్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ డా. హిమబిందు సూచించారు.