హైదరాబాద్: 28°C
తెలంగాణ

రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం

HYD: హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్, కర్ణాటక మంత్రి పుట్టరంగ శెట్టి సగర హాజరై విద్యారంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.