హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్‌లో గణనాథుడి ప్రత్యేక అవతారం!

MDCL: పట్టణంలోని స్టేషన్ రోడ్‌లో వినాయక చవితి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భగత్‌సింగ్ సేన ఆధ్వర్యంలో అయోధ్య రామమందిరం తరహాలో ప్రత్యేక షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సీతారాముల రూపంలో కొలువుదీరిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినూత్న అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.