హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

MDK: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి జిల్లా కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా వేడుకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.