హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతి సర్వే, రీ సర్వే పై అవగాహన సదస్సు

SRCL: ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీలో భూభారతి సర్వే, రీ-సర్వేపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ నరసింహులు మాట్లాడుతూ.. భూ హద్దులు, రికార్డులను పక్కాగా నమోదు చేసేందుకు సర్వే ఉపయోగపడుతుందని, రైతులు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలతో సహకరించాలని, వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.