GDWL: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని అలంపూర్‌లోని ఎల్లారెడ్డి వీధిలో వినాయక మండపం వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ మెంబర్ మహమ్మద్ ఇస్మాయిల్ ఈ కార్యక్రమానికి దాతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
వేడుకలు సోదరభావాన్ని పెంచుతాయి: ఇస్మాయిల్


