PPM: జిల్లాను డోలీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష అనంతరం ఆమె మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిలిచిపోయిన రహదారుల పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘డోలీ రహిత జిల్లా’గా మారుస్తాం


