SRCL: ఎల్లారెడ్డిపేట మండలం తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా అందె సుభాష్ బుధవారం నియమితులయ్యారు. గ్రామపంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యలు, పెండింగ్ బిల్లులు, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు అప్పగించిన జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు సర్పంచులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులుగా సుభాష్


