హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల నివారణకు ప్రణాళికలు సిద్ధం

GNTR: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కార్యక్రమంపై జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల సుమారు 4,62,714 మంది బాలబాలికలకు అంగన్వాడీలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వెలుపల ఉన్నవారికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.