హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం

ASR: పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని బుధవారం విజ్ఞానశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓజోన్ పొర ప్రాధాన్యత, క్షీణత వల్ల కలిగే దుష్పరిణామాలు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు. సూర్యుడి హానికర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశులను ఓజోన్ పొర కాపాడుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు.