హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవం

VZM: మెంటాడ మండలం జయతి గ్రామంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవం సూపర్‌వైజర్ ధనలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాలను ఆహారంలో ఎలా వినియోగించాలో వివరించారు.