హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌నగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని గణేష్‌నగర్‌లో రాజా శివచత్రపతి యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గణేష్‌నగర్ పరిసర ప్రాంతం భక్తి వాతావరణంతో సందడిగా మారింది.