హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాపాలన దినోత్సవానికి హాజరుకావాలి'

SRPT: ఈనెల 17న సూర్యాపేటలోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు తెలిపారు. ఉదయం 10:00 గంటలకు జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 09:30 గంటలకల్లా వేడుకల ప్రాంగణానికి చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు.