హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

KDP: వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కడప జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులను మోహరించారు. బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టారు.