హైదరాబాద్: 28°C
తెలంగాణ

32 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ASF: వాంకిడి (M) సోనాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న 32 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సోనాపూర్ కొలంవాడకు చెందిన సెడాం రాజు(40)ను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మహేందర్ తనిఖీలు నిర్వహించి మొక్కలను గుర్తించారు. వీటి విలువ రూ.3.20 లక్షలు ఉంటుందని తెలిపారు.