హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లోధి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి: బీసీ కమిషన్ ఛైర్మన్

MDK :పెద్దశంకరంపేట మండలంలో లోధి సామాజిక వర్గ ప్రజల సమస్యలను బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. లోది వర్గానికి విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.