హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

KNR: కరీంనగర్‌లో ఈ నెల 23న జరిగే వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో నీరు, భారీ క్రేన్లు, జాలర్లు, విద్యుత్‌, లైటింగ్‌, తాగునీరు, ఏర్పాట్లు చేయాలని సూచించారు.