హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక నిమజ్జనంలో డీజేలను వినియోగించవద్దు'

MNCL: వినాయక విగ్రహాల నిమజ్జనంలో డీజేల వినియోగానికి అనుమతి లేదని, అందరూ గమనించాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. బుధవారం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డీజేలు వినియోగించడం వల్ల అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దానికి బదులు ప్రత్యామ్నాయ చిన్న సౌండ్ సిస్టం వినియోగించాలన్నారు.