హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలు టీడీపీలో చేరిక

ASR: అరకులోయ మండలం బస్కీ పంచాయతీ గాయిబందకు చెందిన పలువురు వైసీపీ నేతలు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డా.సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ పాలనలో గిరిజన ప్రాంత అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారని దొన్నుదొర తెలిపారు.