హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ అదుపుతప్పి తండ్రి, కొడుకులకు తీవ్ర గాయాలు

BHPL: కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామ శివారులో బుధవారం బైక్ అదుపుతప్పి తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. కాటారం మండలం బొప్పారం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన జిల్లెల మొండి, రాజుగా గుర్తించారు.108 అంబులెన్స్‌లో మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.