హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

KRNL: ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద నిమజ్జన ఘాట్, ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జన వేడుకలు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.