PLD: చిలకలూరిపేట MPDO కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. వేదికపై అధికారుల స్థానంలో వైసీపీ నేత, మండల పరిషత్ అధ్యక్షుడు దేవినేని శంకరరావు కూర్చోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులపై జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో ప్రోటోకాల్ ఉల్లంఘన రచ్చ


