MDK: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రికవరీ చేసిన రూ.2.43 కోట్ల విలువైన 1,218 మొబైల్ ఫోన్లలో మెదక్‌కు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ ముఖిబ్ ఫోన్ కూడా లభ్యమైంది. ఏడాది క్రితం కూకట్‌పల్లిలో పోగొట్టుకున్న తన ఫోన్ తిరిగి రావడంతో అతను హర్షం వ్యక్తం చేశాడు. ఫోన్ పోయి తీవ్ర మనోవేదనకు గురైన తనకు సైబరాబాద్ పోలీసులు ఫోన్ అందజేయడంపై ముఖిబ్ కృతజ్ఞతలు తెలిపాడు.
తెలంగాణ
ఏడాది క్రితం పోగొట్టుకున్న ఫోన్ లభ్యం


