PDPL: మంథని మండలం పందులపల్లి పరిధిలో భూ సమగ్ర రీ-సర్వే పనులు బుధవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. మండల సర్వేయర్ రాజశేఖర్ చారి నేతృత్వంలో సర్వే బృందం పందులపల్లి, నాగారం శివారు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో హద్దులను పరిశీలించింది. కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని పందులపల్లి శివారు చివరి భూముల సరిహద్దులను గుర్తించి హద్దుల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేశారు.
తెలంగాణ
పందులపల్లిలో భూ రీ-సర్వే ప్రారంభం


