హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం

MNCL: నిరుపేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని మండల విద్యాధికారి మంత్రి రాజు అన్నారు. బుధవారం దండేపల్లి మండలం తాళ్లపేట్ ప్రాథమిక పాఠశాలలో గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా క్రీడా సామాగ్రి విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో, క్రీడల్లో రాణించాలన్నారు.