హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

108 సిబ్బంది సేవాభావానికి ప్రశంసలు!

TPT: నాయుడుపేట సమీపంలో తమిళనాడు ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో లభించిన రూ.15 వేల నగదును భద్రపరిచి, బస్సు డ్రైవర్‌కు డ్యూటీ వైద్యుల సమక్షంలో అప్పగించారు. 108 సిబ్బంది సేవాభావం, నిజాయితీని వైద్యులు, ప్రజలు అభినందించారు.