హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్జీఎఫ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఫుట్ బాల్ క్రీడల్లో జగిత్యాల మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో ఉపాసన, మరియం, కీర్తన, అండర్-17 విభాగంలో హారిక, పవిత్ర, సేహిత, జుబియా, సానియా లు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ సుచిత్ర, పిడి శ్రీవిద్య అభినందించారు.