హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల విద్య, ఆరోగ్యం, భద్రతపై ఆరా

WGL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ బుధవారం ఆటోనగర్ పరిశీలన గృహం, దేశాయిపేట ఇండియన్ డిసిపుల్స్ మిషన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్, సఖీ వన్‌స్టాప్ సెంటర్లను సందర్శించారు. బాలల విద్య, ఆరోగ్యం, వసతి, భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖీ కేంద్రంలో బాధిత మహిళలకు అందుతున్న న్యాయ, వైద్య, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు.