KRNL: వెల్దుర్తి రామళ్లకోట సెక్టార్‌లోని నర్సాపురం, సర్పరాజపురం అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వ జాతీయ పోషణ మాసం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహారం, ఆహార వైవిధ్యంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే వేడి భోజనం, ప్రాంతీయ వంటకాల ప్రదర్శన చేపట్టారు. బాలల ఆరోగ్యం, అభివృద్ధి, సంరక్షణపై తల్లులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పోషణ మాసంలో పోషకాహారంపై అవగాహన


