హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం పవిత్రోత్సవాలు

VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి 25 వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణలు, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. 21న సాయంత్రం 6 గంటల వరకు, 22 నుంచి 25 వరకు సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు.