SDPT: కుకునూర్పల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 4వ దశ వాక్-ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. వెంకట్రమణ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ నెల 17 నుంచి 22 వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తమ అసలు ధ్రువపత్రాలతో వచ్చి ప్రవేశం పొందవచ్చని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
తెలంగాణ
ఐటీఐ ప్రవేశాలకు ప్రకటన


