హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు అధికారుల దృష్టికి తేవాలి: సబ్ కలెక్టర్

SRD: ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తేవాలని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి మండలం MPDO ఆఫీస్‌లో ప్రతి సోమవారం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రజావాణి జరుగుతుందన్నారు. ప్రజల సౌకర్యాలు, అవసరాలు, సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తే పరిష్కరిస్తారన్నారు.