SRD: జహీరాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా డాక్టర్ జె. సీతారామరాజు బుధవారం నియమితులయ్యారు. డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవికి కలసి బాధ్యతల నివేదిక అందజేశారు. సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యపరుస్తూ, పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
డిప్యూటీ డీఎంహెచ్‌వో బాధ్యతల స్వీకరణ


