హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే సాధనకు మద్దతు తెలిపిన మందకృష్ణ

SRPT: సూర్యాపేటకు రైలు సౌకర్యం కల్పించాలని సాగుతున్న ఉద్య మానికి మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో సూర్యాపేట రైల్వే సాధన సమితి ప్రతినిధులు వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారని రైల్వే సాధన సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా తెలియజేశారు.