MHBD: కేసముద్రం (మం) అమీనపూర్‌లో ఓ యువతి తన తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను పూర్తి చేసింది. గ్రామానికి చెందిన సత్యయ్య మృతి చెందగా, ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె సోమలక్ష్మి తండ్రి తలకొరివి పెట్టింది. ఈ ఘటన స్థానికంగా పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలతో కుమార్తె సోమలక్ష్మి ఈ బాధ్యతను నిర్వర్తించారు.
తెలంగాణ
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె


