అన్నమయ్య: వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేట చెరువు వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఐదు ప్రాంతాల నుంచి సుమారు 170 విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులు పోలీసుల సూచనలు పాటించి, నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చెరువు వద్ద పటిష్ఠ బందోబస్తు


