హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్చే వరకు పోరాటం

మహబూబాబాద్ పట్టణంలోని కంకరబోర్డు ప్రభుత్వ పాఠశాలను మాజీ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి పరిశీలించారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరలోనే తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామన్నారు.